సెట్స్‌పైకి బన్నీ-త్రివిక్రమ్‌

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న కొత్త చిత్రం పట్టాలెక్కేసింది. తాజాగా ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి బన్నీ క్లాప్‌ కొట్టారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం. తండ్రీ కొడుకుల కథతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి ఓ హాలీవుడ్‌ చిత్రం స్ఫూర్తట. ఇందులో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటించనుండగా.. సునీల్‌ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే సంగీత చర్చలు మొదలైపోయినట్లు తాజాగా తెలియజేశారాయన. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. ఏప్రిల్‌ 24 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది.


అభిమానుల కోసం..
అల్లు అర్జున్‌ సినిమా ప్రారంభం అనంతరం తిరిగి కారులో వెళుతుండగా, దారిలో దివ్యాంగులైన ఇద్దరు అభిమానులు ఒక ఫోటో కావాలంటూ సంజ్ఞలు చేశారు. అది గమనించిన అల్లు అర్జున్‌ వెంటనే కారు ఆపి, అభిమానుల్ని దగ్గరికి తీసు కొని ఫొటోకి పోచ్కీజిచ్చారు. దాంతో వాళ్లు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అల్లు అర్జున్‌ తన అభిమానుల కోసం కింద కూర్చుని దిగిన ఆ ఫొటో అంతర్జాలంలో వైరల్‌ అయ్యింది.


                               
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.