జోరు జోరుగా ‘డిస్కోరాజా’

‘డిస్కోరాజా’ క్రిస్మస్‌కు వినోదాల విందు పంచేందుకు శరవేగంగా ముస్తాబవుతున్నాడు. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు వి.ఐ.ఆనంద్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం ఇటీవలే గోవాలో కొత్త షెడ్యూల్‌ను షరూ చేసింది. అక్కడ కొన్ని కీలకమైన పోరాట ఘట్టాలతో పాటు నాయకానాయికలపై పాటలను చిత్రీకరించారు. తాజాగా ఈ చిత్ర షెడ్యూల్‌ పూర్తయినట్లు చిత్ర బృందం ట్విటర్‌ ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర ఫొటోలను షేర్‌ చేసింది. వీటిలో ఓ బీచ్‌ ఒడ్డున ‘డిస్కోరాజా’ టైటిల్‌ను సైకత శిల్పంలా తిర్చిదిద్దినట్లు చూడొచ్చు. సైన్స్‌తో ముడిపడిన అంశాలతో ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన ముగ్గురు కథానాయికలు ఆడిపాడనున్నారు. ఈ పాత్రలను పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌, తాన్యా హోప్‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్న డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.