‘గేమ్‌’ మొదలైంది..
గత కొంతకాలంగా వైవిధ్యభరితమైన కథలతోనే హిట్‌లు కొడుతూ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది సొట్టబుగ్గల సుందరి తాప్సి. ఇప్పుడీ భామ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఓవర్‌’. తెలుగు, తమిళ భాషల్లో 'వై నాట్ స్థూడియోస్' ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నయనతారతో ‘మయూరి’ వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన అశ్విన్ శరవణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.శశికాంత్ నిర్మాత. తాజాగా ఈ చిత్రం చెన్నైలో లాంఛనంగా ప్రారంభమయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘ఓ సరికొత్త కధ, కథనాలతో తెలుగు,తమిళ భాషలలో ఏక కాలంలో నిర్మిస్తున్నాం. ఆంధ్ర,తెలంగాణ,తమిళనాడు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది. 'లవ్ ఫెయిల్యూర్', 'గురు' వంటి హిట్ల సరసన ఈ చిత్రం కూడా నిలుస్తుంది’’ అన్నారు. సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్ , కూర్పు: రిచర్డ్ కెవిన్, రచన: అశ్విన్ శరవణన్,కావ్య రాంకుమార్, మాటలు: వెంకట్ కాచర్ల, ఛాయా గ్రహణం: ఎ.వసంత్.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.