గోపీచంద్‌ కొత్తగా మరొకటి షురూ చేశాడు..

తెలుగులో యాక్షన్‌ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు గోపీచంద్‌. త్వరలో ఆయన ‘చాణక్య’ చిత్రంతో ప్రేక్షకులను పలకరిచబోతున్నారు. ఇదొక సరికొత్త స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడింకా ఇది సినీప్రియుల ముందుకు రాకముందే మరో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపేశారు గోపీచంద్‌. బిను సుబ్రహ్మణ్యం అనే నూతన దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రంగా దీన్ని రూపొందించనున్నారట. దీనికి మెలోడీ బ్రహ్మ మణిశర్వ స్వరాలు సమకూర్చనుండగా.. బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ నిర్మించనున్నారు. గోపీకి జోడీగా ఎవరు కనిపిస్తారు? ఇతర నటీనటులు ఎవరు? అన్నది త్వరలోనే ప్రకటించనున్నారట.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.