‘మను చరిత్ర’ను సమర్పిస్తోన్న కాజల్‌

స్టార్‌ కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ సమర్పణలో `మ‌ను చ‌రిత్ర‌` పేరుతో ఓ సినిమా తెరకెక్కబోతుంది. రాజ్‌ కందుకూరి తనయుడు శివ కందుకూరిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ దర్శకుడు పి.భరత్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మేఘా ఆకాశ్‌ కథానాయిక. రాన్సన్‌ జోసెఫ్‌ నిర్మాత. తాజాగా ఈ చిత్రం లాంఛనంగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి కాజ‌ల్ క్లాప్ కొట్ట‌గా.. నిర్మాత సి.క‌ల్యాణ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అజ‌య్ భూప‌తి ముహూర్త‌పు స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సుధీర్ వ‌ర్మ‌, సాహు గార‌పాటి స్క్రిప్ట్‌ను అందించారు. ఓ సరికొత్త ప్రేమకథతో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘ఫాలింగ్‌ ఇన్‌ లవ్‌ ఈజ్‌ ఏ పెయిన్‌ ఫుల్‌ జాయ్‌’ అనే ట్యాగ్‌లైన్‌ను పెట్టారు. డాలీ ధనుంజయ్‌ ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ నెలలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కానుంది. ఈ వేడుకలో అనీల్ సుంక‌ర్‌, రాజ్ కందుకూరి, అనీల్‌ క‌న్నెగంటి, మ‌ధుర శ్రీధ‌ర్‌, సాహు గార‌పాటి, కృష్ణ చైత‌న్య‌, కొండా విజ‌య్‌కుమార్‌, ద‌ర్శ‌కులు రాధాకృష్ణ‌, శివ నిర్వాణ‌, సుధీర్ వ‌ర్మ‌, అజ‌య్ భూప‌తి తదితరులు పాల్గొన్నారు. 



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.