ఇస్మార్ట్‌ శంకర్‌... స్టార్ట్‌ చేశాడు

యన పేరు శంకర్‌. కానీ ‘శంకర్‌’ అని పిలిస్తే ఒప్పుకోడు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ అనాల్సిందే. ఎదుటివాళ్లని బురిడీ కొట్టించే తెలివితేటలు శంకర్‌ సొంతం. అందుకే ఆ పేరు. శంకర్‌ తెలివితేటలు ఏ స్థాయిలో సాగాయో, ఆ బుర్రతో ఎంత మందిని బుట్టలో వేసుకున్నాడో తెలియాలంటే ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చూడాల్సిందే. రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. పూరి జగన్నాథ్‌ దర్శకుడు. పూరితో కలసి ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఛార్మి క్లాప్‌నిచ్చారు. స్రవంతి రవికిషోర్‌ స్విచ్చాన్‌ చేశారు. ‘‘ఇదో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. రామ్‌ పాత్ర కొత్తగా ఉంటుంది. తన గెటప్‌ కూడా వైవిధ్యంగా కనిపిస్తుంది. గురువారం నుంచి చిత్రీకరణ మొదలెడతాం. మేలో విడుదల చేస్తామ’’న్నారు ఛార్మి. పునీత్‌ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్‌ గునాచ్కీజిజి, అశిష్‌ విద్యార్థి, గెటప్‌ శ్రీను తదితరులు నటిస్తున్నారు. సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: రాజ్‌ తోట, కళ: జానీ షేక్, కూర్పు: జునైద్‌ నిద్దిఖి, పాటలు: భాస్కరభట్ల, సమర్పణ: లావణ్య



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.