ఆకట్టుకుంటున్న.. ‘మన్మథుడు 2’ స్టిల్స్‌

నాగార్జున సినీ కెరీర్‌లో ‘మన్మథుడు’ చిత్రానికి ఎంతో ప్రత్యేకత ఉంది. 16 ఏళ్ల క్రితం వచ్చిన ఈ లవ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ సినీ ప్రియులను విపరీతంగా అలరించడంతో పాటు భారీ వసూళ్లను దక్కించుకొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’ను పట్టాలెక్కించారు నాగ్‌. ‘చిలసౌ’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నాగ్‌కు జోడీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తోంది. ప్రస్తుతం పోర్చుగల్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ స్టిల్స్‌లో నాగ్‌ను చూస్తుంటే నిజంగానే నవ మన్మథుడులా కనిపిస్తున్నారు. అంతేకాదు నాగ్‌ - రకుల్‌ల జోడీ కూడా ఎంతో చూడముచ్చటగా దర్శనమిచ్చింది. ఈ స్టిల్స్‌ను చూస్తుంటే ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణను పూర్తి చేసేశారనట్లుగా అనిపిస్తోంది. ఇందులో సమంత ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. రావు రమేష్, వెన్నెల కిషోర్, ఝాన్సీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.



 మరిన్ని స్టిల్స్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.