కుటుంబ సమేతంగా.. కనుల పండగగా..

మలయాళ నటుడు మోహన్‌ లాల్, మీనా కలిసి నటిస్తోన్న చిత్రం ‘దృశ్యం 2’. గతంలో వచ్చిన ‘దృశ్యం’ చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతుంది. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటుంది. కథానాయకుడు మోహన్‌ లాల్‌, మీనా, ఎస్తేర్‌ అనిల్‌, అన్సిబా హాసన్‌ సెట్‌లో అడుగుపెట్టారు. సంబంధిత చిత్రాల్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు మోహన్‌లాల్‌. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ‘జార్జికుట్టీ’ కుటుంబం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ‘దృశ్యం’ చిత్రంతో ఈ కుటుంబం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి దర్శనమివ్వడంతో కనుల పండగగా ఉంది అభిమానులకు.థ్రిల్లర్‌ క్రైం నేపథ్యంలో సాగే ఈ కథ విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలనం సృష్టించింది. మరోసారి ఉత్కంఠ పెంచేందుకు రాబోతుంది. ఆశీర్వాద్‌ సినిమాస్‌ సమర్పణలో ఆంటోనీ పెరుంబవూర్‌ నిర్మిస్తున్నారు. మొదటి భాగాన్ని తెరకెక్కించిన జీతూ జోసెఫ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.