ఫిదా దర్శకునితో చైతన్య

‘మజిలీ’ చిత్రంతో విజయం అందుకున్న నాగ చైతన్య శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తదుపరి చిత్రాన్ని ప్రారంభించారు. గురువారం సికింద్రాబాద్‌లోని ఓ ఆలయంలో లాంఛనంగా షూటింగ్‌ మొదలైంది. నారాయణ్‌దాస్‌ నారంగ్, పి. రామ్మోహనరావు నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. ఎన్నో సినిమాలకు డిస్ట్రిబ్యూటర్స్‌గా వ్యవహరించిన ఏషియన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి రాబోతుంది. ‘ఫిదా’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రం తర్వాత శేఖర్‌ తీస్తున్న సినిమా కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. నాగ చైతన్య 20వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సెప్టెంబరు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. ప్రస్తుతం నాగ చైతన్య ‘వెంకీ మామ’ చిత్రంలో నటిస్తున్నాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.