సెట్స్‌లో అడుగు పెట్టిన నాగశౌర్య


కొన్ని రోజుల విరామం అనంతరం హీరో నాగశౌర్య షూటింగ్‌లో పాల్గొన్నారు. ఐరా క్రియేషన్స్‌ బ్యానర్‌లో ప్రొడక్షన్‌ నెం.3 గా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. వైజాగ్‌లో చిత్రీకరణ జరుగుతుండగా ఆయన కాలికి గాయం విషయం తెలిసిందే. శస్త్రచికిత్స కారణంగా కొంత కాలం విశ్రాంతి తీసుకున్న శౌర్య నేడు షూటింగ్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని మలక్‌ పేట ప్రాంతంలో చిత్రీకరణ మొదలైంది. తొలి షాట్‌ నాగశౌర్య పై చిత్రీకరించారు. ఈ సినిమాతో రమణ తేజ దర్శకునిగా పరిచయమవుతున్నాడు. తాను నటించిన సినిమా కార్యక్రమాలకు హాజరవ్వాల్సిన బాధ్యత ఉందని భావించి ఇటీవలే జరిగిన ‘ఓ బేబీ’ చిత్ర ముందస్తు విడుదల కార్యక్రమానికి వెళ్లడం విశేషం.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.