ప్రేమకథ.. మళ్లీ మొదలైంది!

యువ కథానాయకుడు నాగశౌర్య వరుస అవకాశాలు అందుకున్న సంగతి తెలిసిందే. నూతన దర్శకురాలు లక్ష్మీ సౌజన్యతతో ఓ చిత్రాన్ని గతంలోనే పట్టాలెక్కించారు. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఈ చిత్రం సోమవారం పునఃప్రారంభమైంది. అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుని హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుతోంది చిత్ర బృందం. నాయకానాయికలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్‌ చంద్ర శేఖర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. శౌర్యకు జోడీగా రితూ వర్మ కనిపించబోతుంది. ఓ వైవిధ్యమైన ప్రేమ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం ‘మూగ మనసులు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తోన్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ, చిత్ర బృందం ఇంత వరకు టైటిల్‌పై ఓ నిర్ణయానికి రానట్లు సమాచారం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.