శౌర్య.. కొత్తగా మరొకటి

యువ హీరో నాగశౌర్య వరుస చిత్రాలతో బిజీ అవుతున్నారు. ఇటీవలే ‘అశ్వథ్థామ’తో కథానాయకుడిగానే కాక రచయితగానూ మెప్పించిన శౌర్య.. ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్‌ తెరకెక్కిస్తున్న ఓ సరికొత్త ప్రేమకథలో నటిస్తున్నారు. తాజాగా లక్ష్మీ సౌజన్య అనే నూతన దర్శకురాలితో చెయ్యబోతున్న కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించారు. దీన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మించబోతున్నారు. విశాల్‌ చంద్ర శేఖర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో శౌర్యకు జోడీగా రితూ వర్మ కనిపించబోతుంది. ఫిబ్రవరి 19 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభం కాబోతుంది. ఓ వైవిధ్యమైన ప్రేమ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం ‘మూగ మనసులు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తోన్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ, చిత్ర బృందమైతే ఇంత వరకు టైటిల్‌పై ఓ నిర్ణయానికి రానట్లు సమాచారం. సినిమాను ఈ ఏడాది ద్వితియార్థంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.