అప్పుడు ‘అ!’.. ఇప్పుడు ‘హిట్‌’

యువ కథానాయకుడు నాని నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై తొలి చిత్రం ‘అ!’తో ప్రేక్షకుల్ని ఆశ్చపరిచాడు. ఈ సినిమా ప్రశంసలతోపాటు అవార్డులు అందుకుంది. తాజాగా మరో సినిమాను నిర్మిస్తున్నాడు. ‘ఫలక్‌నుమాదాస్‌’ ఫేం విశ్వక్‌సేన్‌ కథానాయకుడుగా ఓ చిత్రాన్ని వాల్‌ పోస్టర్‌ సినిమా సమర్పణలో ‘హిట్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ‘ది ఫస్ట్‌ కేస్‌’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో రుహానా శర్మ కథానాయిక నటిస్తుంది. ఈ చిత్రంతో శైలేష్‌ దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. ప్రశాంతి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంగీతం వివేక్‌ సాగర్‌ అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నాని క్లాప్‌నిచ్చారు. సామాజిక మాధ్యమాల వేదికగా చిత్ర పోస్టర్‌ను విడుదల చేశారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.