‘నిశ్శబ్దం’గా షూట్‌ షురూ చేసిన స్వీటీ

‘భాగమతి’ వంటి హిట్‌ తర్వాత ఏడాదికి పైగా విరామం తీసుకుంది స్వీటీ బ్యూటీ అనుష్క. ఇప్పుడీ భామ హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో ఓ బహుభాషా చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. కోన వెంకట్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ అమెరికాలో ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్ర బృందం ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. ముందు నుంచి అనుకున్నట్లుగానే దీనికి ‘సైలెన్స్‌’ అనే టైటిల్‌నే ఫిక్స్‌ చేశారు. తెలుగులో ‘నిశ్శబ్దం’గా విడుదలవుతుంది. ఇందులో స్వీటీతో పాటు మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఓ సరికొత్త సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో అనుష్క ఓ దివ్యాంగురాలిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది ప్రధమార్థంలో కానీ.. ఈ సినిమా తెరపైకి రానుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.