న్యాయంకై ప్రశ్నించిన ‘ఒకడు’..

ఖిల్‌ రెడ్డి, దీపిక వడ్డాని, దీపాలి శర్మ నాయకానాయికలుగా నటిస్తోన్న చిత్రం ‘ఒకడు’. నూతన దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్నారు. సండ ముత్తయ్య, సోమరాజు కల్యాణి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శనివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి నృత్య దర్శకుడు శేఖర్‌ మాస్టర్‌ క్లాప్‌ నివ్వగా.. సత్య మాస్టర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ ‘‘న్యాయస్థానంలో ఓ వ్యక్తికి సరైన సమయంలో న్యాయం జరగకపోవడం కూడా అన్యాయమే అని చెప్పడం ఈ చిత్ర కథాంశం. యథార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న థ్రిల్లర్‌ కథాంశమిది. ఆగస్టు 16 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతాం. హైదరాబాద్, కాకినాడ, పిఠాపురం ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు’’ అన్నారు. ‘‘కొత్త వారితో.. ఓ సరికొత్త కథాంశంతో మంచి సందేశాత్మకంగా సినిమా తీసుస్తున్నామ’’న్నారు నిర్మాత ముత్తయ్య. హీరో అఖిల్‌ మాట్లాడుతూ.. ‘‘నా పాత్ర ఫుల్‌ మాస్‌గా ఉంటుంది. సినిమా.. చివరి నిమిషం వరకు ఉత్కంఠత రేకెత్తించేలా ఉంటుంద’’న్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.