ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేతిలో మూడు చిత్రాలున్నాయి. వాటిలో ఒకటి వేణు శ్రీరామ్‌తో చేస్తున్న ‘వకీల్‌సాబ్’ కాగా.. మరో రెండు క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో చెయ్యాల్సిన చిత్రాలు. వీటిలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం తుది దశలో ఉండగా.. క్రిష్ చిత్రం ఓ చిన్నపాటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు చిత్రీకరణలకు అనుమతులిచ్చిన వెంçనే పవన్ తన దృష్టినంతా ‘వకీల్‌సాబ్’పైనే పెట్టనున్నారట. దీనికి సంబంధించి ఆయన సన్నిహిత వర్గాల నుంచి ఓ ప్రకటన విడుదలైంది. ‘‘చిత్రీకరణలు ప్రారంభమైన వెంటనే పవన్ ‘వకీల్‌సాబ్’ను పూర్తి చేసేందుకు రంగంలోకి దిగుతారు. ఆ తర్వాత పూర్తిగా క్రిష్ చిత్రానికే తన సమయాన్ని కేటాయిస్తారు. దీన్ని వరుస షెడ్యూళ్లలో పూర్తి చెయ్యబోతున్నారు క్రిష్’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.