బ్రేకింగ్‌‌.. తెలుగు ‘పింక్‌’ మొదలైందట!!

పవన్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘పింక్‌’ రీమేక్‌తో వెండితెరపైకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైనట్లు తెలిసింది. ఎలాంటి మీడియా హడావుడి లేకుండా దిల్‌రాజు ఆఫీస్‌లో ఈ ప్రారంభ వేడుక జరిగినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం పవన్‌ కాకినాడలో రైతు సౌభాగ్య దీక్షలో పాల్గొంటున్న నేపథ్యంలో ఆయన లేకుండానే ఈ చిత్రాన్ని ప్రారంభించిందట చిత్ర బృందం. జనవరి నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభం కానుందని, ఫిబ్రవరి నుంచి పవన్‌ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం ఆయన కేవలం 20 రోజుల డేట్స్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగానే ఇప్పటి నుంచే ప్రీప్రొడక్షన్‌ పనులను ముమ్మరం చేస్తున్నారట. ఈ చిత్రంలో పవన్‌ లాయర్‌గా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా సమంత లేదా నివేదా కనిపించవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.