`పాయిజ‌న్` చిత్రం షూటింగ్‌ ప్రారంభం.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్‌విఆర్ మీడియా శోభారాణి త‌న‌యుడు ర‌మ‌ణ‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ సిఎల్ఎన్ మీడియా ప‌తాకంపై ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో కె. శిల్పిక‌, ప్ర‌వ‌ల్లిక నిర్మిస్తోన్న డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ `పాయిజ‌న్‌`(వ‌ర్కింగ్ టైటిల్‌). సిమ్రన్‌, సారిక‌, అర్ఛ‌న‌, శివ‌ణ్య హీరోయిన్స్‌గా న‌టిస్తుండగా, న‌టుడు ష‌ఫీ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. చిత్రం హైద‌రాబాద్‌ సంస్థ కార్యాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. తొలి స‌న్నివేశాన్ని హీరో ర‌మ‌ణ‌, హీరోయిన్స్ సిమ్రన్‌, సారిక‌, అర్ఛ‌న‌, శివ‌ణ్యలపై తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు ర‌విచంద్ర‌న్‌. ఈ సంద‌ర్భంగా ఏర్పాటుచేసిన విలేఖ‌రుల స‌మావేశంలో.. చిత్ర నిర్మాత‌లు కె.శిల్పిక‌, ప్ర‌వ‌ల్లిక మాట్లాడుతూ క‌రోనా లాక్‌డౌన్ త‌ర్వాత ఒక కొత్త సినిమాని ఎనౌన్స్ చేయ‌డం సంతోసంగా ఉంది. ద‌ర్శ‌కుడు ర‌విచంద్ర‌న్ మాట్లాడుతూ ``ఈ సినిమా ఒక డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌. ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో ప్ర‌తిక్ష‌ణం ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతుంది. కార్యక్రమంలో కథానాయికలు సిమ్రన్‌, సారిక‌, అర్చన‌, శివ‌ణ్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ సిరాజ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.