కంబాల‌ప‌ల్లి క‌థ‌లు వినిపించ‌బోతున్నాడు..

త‌న‌దైన న‌ట‌న‌తో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి గుర్తింపు తెచ్చ‌కున్నాడు ప్రియ‌ద‌ర్శి. ఓ వైపు హాస్యం పండిస్తూనేమ‌రోవైపు హృద‌యాల్ని హ‌త్తుకునే పాత్ర‌లు చేస్తున్నాడు. తాజాగా ఇప్పుడాయన ప్రధాన పాత్రలో ‘కంబాలపల్లి కథలు’ పేరుతో ఓ ఆసక్తికర వెబ్‌సిరీస్‌ తెరకెక్కుతోంది. ఉదయ్‌ గుర్రాల దర్శకుడు. ‘మహానటి’ నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంక దత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ ప్రారంభమైనట్లు నిర్మాతలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. కంబాలపల్లి అనేది వరంగల్‌లో ఉన్న ఓ అందమైన గ్రామం. ఈ సిరీస్‌ మొత్తం ఆ గ్రామీణ నేపథ్యంలోనే సాగనున్నట్లు తెలుస్తోంది. హైబాత్‌ అనే పాత్రలో ప్రియదర్శిదర్శనమివ్వబోతున్నారు. త్వరలోనే ఇతర నటీనటుల వివరాల్ని ప్రకటించనున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.