దిమాక్‌ ఖరాబ్‌ చేస్తున్న నభా
ఎనర్జిటిల్ స్టార్ రామ్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. `డబుల్ దిమాక్`.. ఉపశీర్షిక. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి, ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో పాట చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ‘‘దిమాక్‌ ఖరాబ్‌’’ అంటూ సాగే ఈ పాటలో నిధి‌, న‌భా ఇద్ద‌రూ రామ్‌తో ఆడిపాడుతున్నారు. ఈ పాటకు సంబంధించిన నిధి అగ‌ర్వాల్ లుక్స్‌ ఇటీవలే విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పంద‌న‌ వచ్చింది. ఇప్పుడు న‌భా స్టిల్స్‌ విడుద‌ల‌య్యాయి. ఇందులో ఆమె స‌రికొత్త లుక్‌లో, రూర‌ల్ స్టైల్లో ఆక‌ట్టుకుంటోంది. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ స్వరాలు సమకూర్చారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.