‘ఇద్దరి లోకం ఒకటే’ అంటున్న రాజ్‌తరుణ్‌

రాజ్‌త‌రుణ్ కథానాయకుడిగా నూతన దర్శకుడు జి.ఆర్‌.కృష్న తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. సోమ‌వారం హైద‌రాబాద్‌లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభ‌మైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి వి.విజ‌యేంద్ర ప్ర‌సాద్ క్లాప్ కొట్ట‌గా.. ప్ర‌సాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దిల్‌రాజు మ‌న‌వ‌డు మాస్ట‌ర్ ఆరాన్ష్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ ``ఇద్ద‌రి లోకం ఒక‌టే` రాజ్‌త‌రుణ్‌తో మా బ్యాన‌ర్‌లో చేస్తోన్న రెండో చిత్రం. కృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తుండ‌గా.. స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అబ్బూరి ర‌వి మాట‌ల‌ను అందిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు న‌చ్చేలా సినిమా ఉంటుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్నివివ‌రాల‌ను తెలియ‌జేస్తాం`` అన్నారు.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.