సుధీర్‌.. ప్రేమ కథా చిత్రం

‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ చిత్రంతో సుడిగాలి సుధీర్‌ను కథా నాయకుడిగా తెరకు పరిచయం చేశారు దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల. ఇప్పుడీ ఇద్దరి కలయికలో మరో సినిమా రాబోతుంది. అంజన్‌ బాబు నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైంది. సెప్టెంబరు తొలి వారం నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘వాణిజ్యాంశాలతో, చక్కటి వినోదాత్మక ప్రేమ కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించనున్నాం. సప్తగిరి ప్రత్యేక పాత్రలో నటిస్తారు. యువతరాన్ని ఆకట్టుకునే పాటలు, కామెడీ పంచ్‌లు పుష్కలంగా ఉంటాయ’’న్నారు. ఈ చిత్రానికి చరణ్‌ అర్జున్‌ సంగీతం అందిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.