రాజుగారి మూడో గది తెరచుకుంది

ఓంకార్‌ దర్శకత్వం వహించిన ‘రాజుగారి గది’ మంచి విజయాన్ని అందుకుంది. ఆ ఉత్సాహంతోనే ‘రాజుగారి గది 2’ కూడా తీశారు. ఇప్పుడు మూడో భాగం కూడా మొదలైపోయింది. తమన్నా ప్రధాన పాత్ర పోషిస్తోంది. అశ్విన్‌ కీలక పాత్రధారి. ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. గురువారం ఉదయం హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు క్లాప్‌నిచ్చారు. అలోక్‌ జైన్‌ స్విచ్చాన్‌ చేశారు. ‘‘తొలి రెండు భాగాలూ ఎంతగా అలరించాయో, మూడో భాగం అంతకంటే ఎక్కువే వినోదాన్ని అందిస్తుంది. భయం, వినోదం రెండూ సమపాళ్లలో మేళవించాం. శుక్రవారం నుంచి షూటింగ్‌ మొదలవుతుంద’’ని చిత్రబృందం తెలిపింది. ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, మాటలు: బుర్రా సాయిమాధవ్‌.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.