ఆర్జీవీ బయోపిక్‌ మొదలైంది

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ జీవితం తెరకెక్కబోతుందని తెలిసిన విషయమే. మూడు భాగాలుగా రూపొందనుందీ చిత్రం. పార్ట్‌ 1కి ‘రాము’ అనే పేరు ఖరారు చేశారు. ఆర్జీవీగా దొరసాయి తేజ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడూ ఆయనే. బుధవారం లాంఛనంగా చిత్రీకరణ ప్రారంభమైంది. ఆర్జీవీ సోదరి విజయ తొలి సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు. చిత్ర నిర్మాత బొమ్మకు మురళీ, ఆయన సతీమణి హిమమాల స్క్రిప్ట్‌ని తేజకు అందజేశారు. ముందుగా ఆర్జీవీ కాలేజీ రోజుల్ని షూట్‌ చేయనున్నారు. ‘‘ఇతను దొరసాయి తేజ. నా బయోపిక్‌కి దర్శకుడు, కుర్రాడిగా ఉన్నప్పటి నా పాత్రను పోషిస్తున్నాడు. సామాజిక మాధ్యమ ప్రపంచంలోకి ఇతణ్ని ఆహ్వానిస్తున్నా’’ని పేర్కొన్నారు ఆర్జీవీ. ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈ ప్రతిభావంతుడైన దర్శకుడి జీవితం తెరపై ఎలా ఉంటుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.