తేజ చేతుల మీదుగా ‘రంగమార్తాండ’ షురూ..

దర్శకుడు కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ అనే చిత్రం తెరకెక్కిస్తున్నాడనే విషయం తెలిసిందే. అభిషేక్‌ జవ్కర్, మధు కలిపు నిర్మాతలు. సోమవారం లాంఛనంగా ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకుడు తేజ గౌవర దర్శకత్వం వహించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నాడు కృష్ణ వంశీ. ‘ఈ కార్యక్రమానికి వచ్చిన స్నేహితుడు, సెన్సేషనల్‌ దర్శకుడు తేజకి కృతజ్ఞతుల’ని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాష్‌ రాజ్, బ్రహ్మానందం కీలక పాత్ర పోషించనున్నారు. సంగీతం: ఇళయరాజా. మరాఠీ చిత్రం ‘నట సామ్రాట్‌’కు తెలుగు రీమేక్‌గా రూపొందుతుంది.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.