రవితేజ కొత్త చిత్రం షురూ!

గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రం చేస్తున్నాడనే విషయం తెలిసిందే. శ్రుతిహాసన్‌ కథానాయిక. హైదరాబాద్‌లో గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ నివ్వగా, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. దర్శకుడు సురేందర్‌ రెడ్డి, నిర్మాత దిల్‌ రాజు ఈ చిత్ర స్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు. అగ్ర దర్శకుడు రాఘవేంద్రరావు తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించారు. బి.మధు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘క్రాక్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. 2020 వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. తమిళ నటులు సముద్ర ఖని, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం: తమన్‌.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.