ప్రచార చిత్రం ఆవిష్కరణ

ఆర్‌.కె దర్శకత్వం వహించిన చిత్రం ‘హైదరాబాద్‌ నవాబ్స్‌ 2’. ఆయనే నిర్మాత. ఆర్‌కె, అజీజ్‌ నాజన్, నీరూ సింగ్, కెబి జానీ, సాజిద్‌ ఖాన్‌ కీలక పాత్రలు పోషించారు. హైదరాబాద్‌లో ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించారు. ‘‘2006లో వచ్చిన హైదరాబాద్‌ నవాబ్స్‌ మంచి విజయాన్ని అందుకుంది. ఆ వినోదానికి ఏమాత్రం తగ్గకుండా రెండో భాగాన్ని తెరకెక్కించాం. హైదరాబాద్‌ నగర సంస్కృతిని, ఇక్కడున్న సందడిని తెరపై చూపిస్తాం. వినోదాత్మక చిత్రాల్ని ఇష్టపడేవాళ్లకు మా ప్రయత్నం తప్పకుండా నచ్చుతుంద’’న్నారు.







Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.