ప్రతి పోరాటం.. చిన్నసైజు యుద్ధంలా!!

థానాయకులు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ గాయాల నుంచి కోలుకొన్నారు. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ కోసం మళ్లీ వరుసగా రంగంలోకి దిగుతున్నారు. అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో, డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో రాత్రివేళల్లో పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి సినిమాల్లో ప్రతి పోరాట ఘట్టం చిన్న సైజు యుద్ధంలా ఉంటుంది. అలాంటి సన్నివేశాల్నే ప్రస్తుతం రూపొందిస్తున్నట్టు సమాచారం. ఎన్టీఆర్‌ ఇప్పటికే రంగంలోకి దిగగా, కుటుంబంతో కలిసి ఇటీవలే విదేశీ పర్యటనని ముగించుకొని వచ్చిన చరణ్‌ కూడా త్వరలోనే చిత్రబృందంతో కలవనున్నారు.చీలమండ గాయంతో చరణ్, చేతి గాయంతో ఎన్టీఆర్‌ కొన్నాళ్లపాటు చిత్రీకరణకి దూరమయ్యారు. వాళ్లిద్దరూ గాయాల నుంచి కోలుకొని రంగంలోకి దిగడంతో చిత్రీకరణలో వేగం పెరిగే అవకాశం ఉంది. ఇందులో ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌గా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. రూ.300 కోట్ల పైచిలుకు వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమా 2020 జులై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.