ముంబయిలో ‘సాహో’..

ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ముంబయిలో మొదలుకానుంది. ఇటీవలే హైదరాబాద్‌లో కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసిన చిత్రబృందం ముంబయిలో దిగింది. ఈ చిత్రంలో పోరాట ఘట్టాలకు చాలా ప్రాధాన్య ఉండటంతో అబుదాబీ, ఇటలీలో తెరకెక్కించారు. హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ కెన్నీ బ్యాట్స్‌ నేతృత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఘట్టాలు చిత్రంలో హైలెట్గా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో’ పేరుతో చాప్టర్‌ 1, 2లుగా విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ప్రభాస్, శ్రద్ధ తొలిసారి కలిసి నటించడంతో వీళ్లిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని అలరిస్తుందని చిత్రబృందం ధీమాగా ఉంది. యువీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.