నీకై అభిసారికనై..

సాయిబాబు, ఆషీరాయ్, సురయ పర్వీన్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘నీకై అభిసారికనై’. వెంకట్రామ్‌ పల్లా దర్శకత్వం వహిస్తున్నారు. సుగుణ.ఒ నిర్మాత. మంగళవారం హైదరా బాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి రవి కనకాల క్లాప్‌నిచ్చారు. దర్శకనిర్మాత మద్దినేని రమేష్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ ‘‘సరికొత్తగా సాగే కథ, కథనాలతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. కొత్తతరం నటీనటులు ఇందులో కనిపిస్తారు. పేరుకు తగ్గట్టుగా కవితాత్మకంగా సాగుతూ మంచి అనుభూతికి గురిచేస్తుంది. రాజ్‌కిరణ్‌ సంగీత సారథ్యంలో ఇప్పటికే 5 పాటల రికార్డింగ్‌ పూర్తయింది’’ అన్నారు. కె.నెహ్రూబాబు, బాలాజీ, నాగభూషణ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పి.వి.రామారావు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.