‘సోలో బ్రతుకే సో బెటర్‌’ అట
సాయి ధరమ్‌ తేజ్‌ కథానాయకుడుగా సుబ్బు అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. నభా నటేష్‌ కథానాయిక. ఈ చిత్రం హైదరాబాద్‌లో సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నవంబరు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. కథా నేపథ్యం, సాంకేతిక వర్గం వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్. ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్‌ మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ చేస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.