థ్రిల్ చేసేందుకు..

రాహుల్‌, చేతన్‌ అహింస ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. విరాట్‌ చక్రవర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంగీత దర్శకుడు సాయి కార్తిక్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఇద్దరు నాయకులపై సాగే తొలి సన్నివేశానికి నిర్మాత క్లాప్‌నిచ్చారు. ‘అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా ఈ కథ ఉంటుంద’ని చిత్ర వర్గాలు తెలిపాయి. సాక్షి చౌదరి, ఐశ్వర్య నాయికలు. సాయి కార్తిక్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. టైటిల్‌ ఇంకా ఖరారు చేయలేదు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.