సాయిధన్సిక చిత్రం ప్రారంభం

‘కబాలి’ సినిమాతో మెరిసిన సాయిధన్సిక ప్రధాన పాత్రధారిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. హరి కొలగాని దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీసాయిలక్ష్మి క్రియేషన్స్‌ పతాకంపై పి.యస్‌.ఆర్‌.కుమార్‌ (వైజాగ్‌ బాబ్జి) నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ క్లాప్‌నిచ్చారు. నిర్మాతలు బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దిల్‌రాజు గౌరవ దర్శకత్వం వహించారు. గురువారం నుంచి రామోజీ ఫిలింసిటీలో 20 రోజులపాటు తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకుంటుంది. కథా నాయిక సాయిధన్సిక మాట్లాడుతూ ‘‘తెలుగు చిత్ర పరిశ్రమ నాకు చాలా ప్రత్యేకం. ఇక్కడ వాతావరణం బాగుంటుంది. హరి ఈ కథ చెప్పాక వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నా’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘దర్శకత్వ విభాగంలో పనిచేసిన అనుభవం ఉంది. నేను రాసుకున్న కథ బాగుందని మెచ్చుకుని, ప్రోత్సహించారు బెక్కెం వేణుగోపాల్‌. ఇందులో ధన్సిక పాత్ర కొత్తగా ఉంటుంది. యువతరానికి నచ్చే మంచి వినోదాత్మక చిత్రమిది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘పంపిణీదారుడిగా చిత్ర పరిశ్రమతో మంచి అనుబంధం ఉంది. ఒక చక్కటి కథతో నిర్మాతగా మారడం ఆనందంగా ఉంది’’ అన్నారు.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.