కల్యాణ్‌ దేవ్‌ కొత్త చిత్రం ప్రారంభం


తొలి సినిమా ‘అశ్వథ్థామ’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రమణ తేజ. తదుపరి చిత్రం యువ కథానాయకుడు క‌ళ్యాణ్ దేవ్‌తో చేస్తున్నారు. ఎస్. ఆర్. టి ఎంటర్ టైన్మెంట్స్, శుభమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాత రామ్‌ తళ్లూరి సారథ్యంలో గురువారం పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. హైదరాబాద్ కూక‌ట్ ప‌ల్లిలోని తుల‌సి వ‌నం శ్రీవెంక‌టేశ్వ‌ర దైవ స‌న్నిధానంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. యువ దర్శకులు వెంకీ కుడుముల, ప్ర‌ణీత్, వేణు ఉడుగ‌ల ముఖ్య అతిధులుగా విచ్చేసి, చిత్ర బృందానికి శుభాభినంద‌న‌లు తెలిపారు ‘విజేత’తో వెండితెరకు పరిచయమై ‘సూప‌ర్ మచ్చి’ అనే చిత్రంలో న‌టిస్తున్న క‌ళ్యాణ్ దేవ్‌కి ఇది మూడో చిత్రం. ప్రీ ప్రొడ‌క్ష‌న్ కి సంబంధించిన‌ కార్య‌క్ర‌మాలు త్వ‌ర‌లోనే పూర్తి చేసుకొని సెట్స్ మీద‌కు సినిమాను తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. దీపావ‌ళి కానుకగా నవంబ‌ర్ 14న ఉద‌యం 10గంల‌కు ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ క‌థ, క‌థ‌నం: చిత్రానికి దేశరాజ్ సాయితేజ, సంగీతం: మ‌హ‌తి సాగ‌ర్.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.