సెట్స్‌పైకి తొలి హాకీ ప్లేయర్‌

టాలీవుడ్‌లో తొలిసారి హాకీ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఎ1 ఎక్స్‌ప్రెస్‌’. సందీప్‌ కిషన్‌ కథానాయకుడు. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. సందీప్‌ క్రీడా నేపథ్యంలో నటిస్తున్న తొలి చిత్రమిది. నేటి నుంచే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభంకానుంది. మురళీ కృష్ణ, రఘుబాబు, సందీప్‌లపై తొలి సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ చిత్రానికి డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం హిప్‌ హాప్‌ తమిళ. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.