ప్రారంభమైన సర్కారు వారి పాట

తెలుగు కథానాయకుడు మహేష్‌ నటిస్తున్న కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ రోజు సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ముహుర్తపు సన్నివేశానికి దేవుని పటాలపై సితార క్లాప్‌నివ్వగా, నమ్రత కెమెరా స్విచ్ఛాన్‌ చేసింది. మైత్రి మూవీ మేకర్స్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ సంస్థలు సంయుక్తంగా సినిమాని రూపొందిస్తున్నాయి. ఇందులో కథానాయికగా కీర్తి సురేష్‌ నటిస్తోంది. ప్రస్తుతం పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలౌతున్నాయి. కార్యక్రమంలో నమ్రత మహేష్‌, వారి తనయురాలు సితార, చిత్ర నిర్మాతలు మిగతా సభ్యులు పాల్గొన్నారు. తమన్‌ సంగీత స్వరాలు అందిస్తున్నారు. జనవరి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. చిత్రంలో ఇంకా వెన్నెల కిషోర్, సుబ్బరాజుతో భారీ తారాగణం నటించనుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ - లక్ష్మణ్. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  ఈ యేడాది ఆరంభంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తరువాత మహేష్‌బాబు నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’ కావడం విశేషం. మహేష్‌ నటుడిగా కొనసాగుతూనే ‘మేజర్‌’‌ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అడవి శేష్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.