గుర్తుందా శీతాకాలం షూటింగ్‌ ప్రారంభం

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న కథానాయకుడు సత్యదేవ్‌. తమన్నా కథానాయికగా నాగశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న‘శీతాకాలం గుర్తుందా’ చిత్రం షూటింగ్ ఈరోజు‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా హీరో సత్యదేవ్‌ మాట్లాడుతూ..‘‘ఈ చిత్రంలో నా పాత్ర చాలా ఎమోషనల్‌గా సాగుతోంది. నటి తమన్నా కలిసి నటిండం చాలా ఆనందంగా ఉంది. ఇక సంగీత దర్శకుడు కాలభైరవ మంచి ట్యూన్స్ ఇస్తారని ఆశిస్తున్నా. నా చిత్రాలను చూస్తూ పొత్రహిసున్నా ప్రేక్షకాభిమానులకు ప్రేత్యకంగా కృత‌జ్ఞత‌లు చెప్పుకోవాలన్నారు. ఈ చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాత నాగశేఖర్‌ ప్రత్యేకంగా అభినందలు అంటూ..’’ చెప్పారు. ఇక దర్శకుడు నాగశేఖర్‌, సంగీత దర్శకుడు కాలభైరవ మాట్లాడుతూ..‘‘అసలు ఈ సినిమా టైటిల్‌ ప్రకటించగానే ప్రేక్షకులను నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. మా సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. అందరిని అంచనాలకు అనుగుణంగా చిత్రాన్ని తెరకెక్కిస్తాం. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. ‘‘సినిమా టైటిల్‌ వినగానే మనసుకి చాలా హాయిగా అనిపించింది. సినిమాలోని పాటలు విన్న ప్రేక్షకులకు హాయిగా అనిపించేలా సంగీత అందించడానికి నా శాయశక్తుల కృషి చేస్తాను’’ చెప్పారు. నాగశేఖర్‌ మూవీస్‌, భావన రవిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర పూజా కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్‌ సత్య హెగ్డే, రచయిత లక్ష్మీ భుపాల్‌ ఇంకా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.