శర్వానంద్‌ కొత్త చిత్రం ప్రారంభం

థానాయకుడు శర్వానంద్‌ కొత్త చిత్రం ఒకటి ఈ రోజు చెన్నైలో ప్రారంభమైంది. శ్రీకార్తిక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయికగా రీతూ వర్మ నటిస్తుంది. డ్రీమ్‌ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తరుణ్‌ భాస్కర్‌ సంభాషణలు అందిస్తున్నారు. శర్వా నటించిన రణరంగం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.