శివాజీ రాజా తనయుడు విజయ్ రాజు కొత్త చిత్రం ప్రారంభం


జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా తనయుడు విజయ్ రాజు, తమన్నా వ్యాస్ నాయికానాయకులుగా నటిస్తున్న కొత్త చిత్రం ప్రారంభమైంది. రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తూము నరసింహ పటేల్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం ఈరోజు హైదరాబాద్ లోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హీరో నాగ శౌర్య ముఖ్య అతిధిగా విచ్చేసి ముహూర్తం షాట్‌కి క్లాప్‌నిచ్చారు. ఈ చిత్రంలో అయిదు పాటలు ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, చెన్నై, మున్నార్, గోవా లాంటి ప్రదేశంలో సినిమా చిత్రీకరించనున్నారు. హీరో విజయ్ రాజా మాట్లాడుతూ "మా చిత్రం ప్రారంభొత్సనికి విచ్చేసిన హీరో నాగ శౌర్యకి చాలా ధన్యవాదాలు. నాకు హీరోగా అవకాశం ఇచ్చినందుకు మా దర్శకుడు నిర్మాతకి ధన్యవాదాలు. కథ చాలా బాగుందన్నారు. శివాజీ రాజా మాట్లాడుతూ "ఈ సినిమా ఈరోజు నుంచి షూటింగ్ మొదలు. కథ బాగుంది. ఇద్దరు హీరోయిన్. నాగ శౌర్య గారికి కృతజ్ఞతలు. ఈ చిత్రం మంచి విజయం సాదించాలి" న్నారు. దర్శకుడు రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ "నాకు అవకాశం ఇచ్చిన జయ దుర్గ దేవి మల్టీ మీడియా బ్యానర్ నిర్మాత తూము నరసింహ పటేల్ గారికి నా ధన్యవాదాలు. మా హీరో విజయ్ రాజా ఈ చిత్రానికి పర్ఫెక్ట్. ఇది పూర్తీ ఎంటర్టైనర్ చిత్రం. శివాజీ రాజా గ్రాము కథ విన్నారు, ఆయనికి కథ బాగా నచ్చింది. హీరోయిన్ తమన్నా వ్యాస్ ఒరిస్సాలో టాప్ హీరోయిన్, మంచి నటి అని తెలిపారు.


'


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.