పదపదరా... ‘సైరా’

చిరంజీవి నటించిన 151వ చిత్రం ‘సైరా’. అమితాబ్‌బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్‌సేతుపతి, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. రామ్‌చరణ్‌ నిర్మాత. చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా మొదలైపోయాయి. ప్రస్తుతం చిరంజీవి డబ్బింగ్‌ థియేటర్లో బిజీగా ఉన్నారు. అక్టోబరు 2న ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది దర్శక నిర్మాతల ఆలోచన. అందుకు తగినట్టుగానే నిర్మాణానంతర కార్యక్రమాల్ని వేగవంతం చేశారు. ప్రముఖ కథానాయిక అనుష్క కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. ఇటీవలే ఆమెకు సంబంధించిన సన్నివేశాల్ని కూడా తెరకెక్కించారు. యుద్ధ సన్నివేశాలు, పోరాట ఘట్టాలకు అధిక ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం విదేశీ నిపుణుల సహకారం తీసుకుంటోంది చిత్రబృందం. ఆగస్టు 22 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. ఈలోగా కీలక పాత్రలకు సంబంధించిన ఛాయా చిత్రాలు ఒకొక్కటిగా విడుదల చేయాలని భావిస్తున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.