ఇటు కరోనా.. అటు ప్రేమ

‘అ!’, ‘కల్కి’ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రశాంత్‌ వర్మ. ఇప్పుడు మూడో ప్రయత్నంగా ‘జాంబి రెడ్డి’ చిత్రాన్ని తెరకెక్కించారు. బాల నటుడిగా పేరు తెచ్చుకున్న తేజ సజ్జా ఈ చిత్రంతో హీరోగా తెరకు పరిచయం కాబోతున్నారు. ఆదివారం తేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో తేజ చిరంజీవి బొమ్మున్న షర్ట్‌ ధరించి, చేతిలో గదతో స్టైలిష్‌గా నుంచోని కనిపించారు. ‘‘కరోనా మహమ్మారి నేపథ్యంలో వస్తున్న తొలి చిత్రమిది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని చిత్ర బృందం తెలియజేసింది. ఈ చిత్రానికి సంగీతం: మార్క్‌ కె.రాబిన్, కూర్పు: సాయిబాబు, ఛాయాగ్రహణం: అనిత్‌.

* ఫాంటసీ ప్రేమకథ..

తేజ సజ్జ, శివానీ రాజశేఖర్‌ జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. చంద్ర శేఖర్‌ మొగుల్ల, సృజన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆదివారం తేజ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘చక్కటి ఫాంటసీ ప్రేమకథతో చిత్రం రూపొందుతోంది. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.