‘విక్టోరియా’ రాణి వస్తోంది
చిత్రాన్షి ద్రంజ్, సంరీన్‌ మజిర్, పింకీ, సంతోష్‌ బాలకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘విక్టోరియా’. మహారాణి అనేది ఉపశీర్షిక. నవీన్‌ లొట్ల దర్శకుడు. వి.అర్జున్‌ అప్పారావు నిర్మాత. ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి రాజ్‌ కందుకూరి క్లాప్‌నిచ్చారు. సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘అనుకోని సంఘటనల వల్ల ముగ్గురు అమ్మాయిల జీవితంలో ఎలాంటి సమస్యలొచ్చాయి? వాటి నుంచి ఎలా బయటపడ్డారు అన్నదే కథ’’ అన్నారు దర్శకుడు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.