తెలుగు సినిమాకి బహుమానం

ప్రముఖ నటులు కృష్ణ, విజయనిర్మల దంపతులకి ‘86 సంవత్సరాల తెలుగు సినిమా’ గ్రంథాన్ని అంకితం చేసినట్టు రచయిత డా.కె.ధర్మారావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని కృష్ణ నివాసంలో పుస్తక అంకితోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రచయిత ధర్మారావు మాట్లాడుతూ ‘‘తెలుగు సినిమా అభిమానిగా దశాబ్దాలుగా తాను సేకరించిన సమాచారంతో ఈ పుస్తకాన్ని రాశాన’’న్నారు. ‘‘విలువైన విషయాలతో కూడిన పుస్తకాన్ని రచించిన ధర్మారావుకి అభినందనలు. ఈ పుస్తకం తెలుగు సినిమాకి బహుమానంగా భావిస్తున్నాం’’ అన్నారు కృష్ణ, విజయనిర్మల. ఈ కార్యక్రమంలో నరేష్, రేలంగి నరసింహారావు, రాధ ప్రశాంతి, వంశీ రామరాజు, కీమల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.