అమృతం కంటే అమ్మ ప్రేమ గొప్పది

ఆమని ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘అమ్మదీవెన’. శివ ఏటూరి దర్శకుడు. ఎత్తరి చినమారయ్య, ఎత్తరి గురవయ్య నిర్మాతలు. శనివారం హైదరాబాద్‌లో బొంతు శ్రీదేవి, సీఎం రాజయ్య చేతుల మీదుగా పోస్టర్‌ విడుదలైంది. ఆమని మాట్లాడుతూ ‘‘అమ్మ ప్రేమలోని గొప్పతనాన్ని చాటే చిత్రం. నేను చేసిన మంచి పాత్రలో దీనికీ చోటు ఉంటుంద’’న్నారు. ‘‘అమ్మ ప్రేమ అమృతం కంటే గొప్పదని ఈ చిత్రంలో చూపిస్తున్నామ’’న్నారు దర్శకుడు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు నిర్మాతలు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.