ఆ రాత్రి ఏం జరిగింది?

భినవ్‌ సింగ్‌ కథానాయకుడిగా మోక్ష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్లే’. రాజ సులోచన.ఎన్‌ నిర్మిస్తున్నారు. 28న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఒక రాత్రి జరిగే చిత్రమిది. పది కథలు ఉంటాయి. అవి ప్రేక్షకులకి వినోదాన్ని పంచుతాయి. పది కథల్ని మేళవించిన విధానం మెప్పిస్తుంది’’ అన్నారు. కథా నాయకుడు మాట్లాడుతూ ‘‘ఇది నాకు మొదటి సినిమా. విభిన్నమైన కాన్సెప్ట్‌తో ముస్తాబవుతోంది. దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంటుంది’’ అన్నారు. నటుడు జగదీష్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.