ఏఎన్నార్‌ అవార్డుల విజేతలెవరంటే?

చిత్ర పరిశ్రమకు అక్కినేని నాగేశ్వరరావు అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ నటులకు అవార్డులు అందజేస్తుంటారు. గురువారం ఎంపికైన వారి వివరాలు ప్రకటించారు. 2018 సంవ‌త్స‌రానికి గానూ శ్రీ‌దేవికి, 2019 సంవ‌త్స‌రానికి గానూ రేఖ‌కు ఈ అవార్డులు అందనున్నాయి. ఈనెల 17న హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్డూడియోస్‌లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ న‌టుడు చిరంజీవి చేతుల మీదుగా ఈ పుర‌స్కారాల ప్ర‌దానం జ‌ర‌గ‌బోతోంది. శ్రీ‌దేవి త‌ర‌పున బోనీక‌పూర్ ఈ అవార్డు స్వీక‌రిస్తారు. అవార్డు క్రింద 5 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుబ‌తి అందివ్వ‌నున్న‌ట్టు నాగార్జున ప్ర‌క‌టించారు. గ‌తంలో అమితాబ్‌బ‌చ్చ‌న్‌, బాల‌చంద‌ర్‌, దేవానంద్‌, రాజ‌మౌళి, ల‌తా మంగేష్క‌ర్ త‌దిత‌ర సినీ ప్ర‌ముఖులు ఏఎన్నార్ అవార్డులు అందుకున్నారు. అక్కినేనితో శ్రీ‌దేవి, రేఖ‌ల‌కు మంచి అనుబంధం ఉంది. ఏఎన్నార్ - శ్రీ‌దేవి కాంబినేష‌న్‌లో ప్రేమాభిషేకం, శ్రీ‌వారి ముచ్చ‌ట్లు లాంటి సూప‌ర్ హిట్ చిత్రాలొచ్చాయి. రేఖ తో ఏఎన్నార్‌కి మంచి అనుబంధం ఉంది. అన్న‌ట్టు.. ఇద్ద‌రూ తెలుగు నుంచి హిందీవైపుకు వెళ్లి, అక్క‌డ స్టార్లుగా ఎదిగిన‌వాళ్లే.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.