నటుడిగా ఎదిగానని అనిపిస్తోంది

మ‌లయాళంలో మంచి విజయాన్ని అందుకొన్న ‘ఏబీసీడీ’ చిత్రాన్ని ఇప్పుడదే పేరుతో తెలుగులో పునర్నిర్మించిన సంగతి తెలిసిందే. అల్లు శిరీష్‌ - రుక్సార్‌ ధిల్లన్‌ జంటగా నటించారు. సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. శిరీష్‌ తండ్రి పాత్రను నాగబాబు పోషించగా.. భరత్, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం మే 17న విడుదలై మంచి ఆదరణను దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి మాట్లాడుతూ.. ``నేడు సినిమా విడుద‌లైంది. తొలి షో నుంచే బ‌ల‌మైన ఓపెనింగ్స్‌ రాబడుతోంది. తండ్రీ కొడుకుల మ‌ధ్య ఎమోష‌న్‌ని పర్‌ఫెక్ట్‌గా సెట్‌ చేయాలి, తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ న‌చ్చేలా తీయాలి అని మేం ఏదైతే ముందు అనుకున్నామో.. అది ఈరోజు నేర‌వేరింది. శిరీష్ అద్భుతంగా న‌టించాడు. ఈ చిత్రంతో శిరీష్ కొత్త స్టార్‌గా మారాడని అంద‌రూ అంటున్నారు. త‌నెంత క‌ష్ట‌ప‌డ్డాడో నాకు తెలుసు. త‌నలో సంతోషం చూడాల‌నుకున్నా. అది ఈరోజు నేర‌వేరింది. నాయకానాయికల మ‌ధ్య ల‌వ్ స్టోరీ, భ‌ర‌త్, వెన్నెల‌కిషోర్ కామెడీ చాలా హైలైట్‌ అయ్యయని అంటున్నారు. ప్రస్తుతం వస్తున్న వసూళ్ల పట్ల ఓ నిర్మాత‌గా చాలా సంతోషిస్తున్నా. త్వ‌ర‌లోనే పెద్ద స‌క్సెస్ మీట్‌ను నిర్వ‌హంచ‌బోతున్నాం`` అన్నారు. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ `` మేం ఎక్క‌డ సినిమాకు మంచి స్పంద‌న వ‌స్తుంద‌ని అనుకున్నామో, దానికి ప్రేక్ష‌కుల నుంచి చక్కటి స్పందన వ‌స్తుంది. శిరీష్‌ చక్కటి నటనను కనబర్చారు`` అన్నారు. శిరీష్ మాట్లాడుతూ.. ``ఏబీసీడీకి నా కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ వ‌చ్చాయి. నటుడిగా నేను ఎదిగానని అనిపిస్తోంది. ఈ పాత్రలో చేస్తున్న‌ప్పుడు అందులో లీనమై ఎంతో ఆస్వాదిస్తూ చేశా. సంజీవ్ న‌న్ను ఎప్పుడూ చూపించని విధంగా చాలా కొత్తగా చూపించాడు. అంద‌రూ బాగున్నాన‌ని, బాగా చేశావ‌ని అంటున్నారంటే ఆ క్రెడిట్ మొత్తం ఆయనకే ద‌క్కుతుంద``న్నారుᐧCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.