సుకుమార్‌ లేకపోతే ఈ చిత్రం లేదు

చావిజయ్‌ రామ్, శివ్‌ శక్తి జంటగా నటించిన చిత్రం ‘అమరం... అఖిలం.. ప్రేమ’. జొనాథన్‌ ఎడ్వర్డ్‌ దర్శకుడు. ప్రసాద్‌ నిర్మాత. ఆదివారం హైదరా బాద్‌లో ప్రచార చిత్రాన్ని ప్రముఖ దర్శకులు సుకుమార్, కొరటాల శివ ఆవిష్కరింరు. అనంతరం కొరటాల శివ మాట్లాడుతూ ‘‘టైటిల్‌ చక్కగా ఉంది. చిత్రీకరణలో నాణ్యత కనిపిస్తోంది. విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకం ఉంద’’న్నారు. సుకుమార్‌ మాట్లాడుతూ ‘‘విజయరామ్‌ హీరో కావాలన్నది వాళ్ల నాన్న కల. తను నటించిన ఓ షార్ట్‌ఫిల్మ్‌ చూశాను. భావోద్వేగాల్ని చక్కగా పండించాడు. ఈ సినిమాకి సరిపోతాడనిపించింది. అందుకే తనని ఎంచుకున్నాం. జొనాథన్‌ తీసిన షార్ట్‌ ఫిల్మ్స్‌తో నేను కూడా స్ఫూర్తి పొందా. రసూల్‌ ఎల్లోర్‌ లాంటి కెమెరామెన్‌ దొరకడం ఈ చిత్రం చేసుకున్న అదృష్టం. రథన్‌ మంచి సంగీతం అందించాడ’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘సుకుమార్‌ లేకపోతే ఈ సినిమా లేదు. నిర్మాత చాలా కష్టపడ్డారు. కథానాయికకు మంచి పేరొస్తుంది. విజయ్‌ బాగా నటించాడ’’న్నారు. త్వరలో విడుదల చేస్తామన్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో భరత్‌ కమ్మ, జక్కా హరిప్రసాద్, శ్రీకాంత్‌ విస్సా తదితరులు పాల్గొన్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.