పవన్‌ మెచ్చిన ‘నీకోసం’

కొత్తదనం నిండిన మా సినిమా ట్రైలర్‌ని చూసి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ మెచ్చుకున్నారన్నారు అవినాష్‌ కోకటి. ఆయన తెరకెక్కించిన చిత్రం ‘నీకోసం’. అరవింద్‌రెడ్డి, సుభాంగి పంత్‌, అజిత్‌ రాధారామ్‌, దీక్షితా పార్వతి ప్రధాన పాత్రధారులు. అల్లూరమ్మ (భారతి) నిర్మాత. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. పవన్‌కల్యాణ్‌ని కలిసింది చిత్రబృందం. కొత్తతరానికి స్ఫూర్తినిచ్చేలా ‘నీకోసం’ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించినట్టు చిత్రవర్గాలు తెలిపాయి. దర్శకుడు మాట్లాడుతూ ‘‘కాన్సెప్ట్‌ ప్రధానమైన చిత్రమిది. కథ, కథనాల పరంగా ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి. ట్రైలర్‌ చూసినవాళ్లు మెచ్చుకుంటున్నారు. పవన్‌ మెప్పు కూడా పొందడం ఆనందంగా ఉంది’’ అన్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.