కలెక్షన్లు...రికార్డులు ముఖ్యం కాదు!
article image
‘‌‘నేను నటిం‌చిన సమ‌ర‌సిం‌హా‌రెడ్డి 132 సెంట‌ర్లలో సిల్వ‌ర్‌జూబ్లీ ఆడింది.‌ అది‌ప్ప‌టికీ చెక్కు‌చె‌ద‌రని రికార్డు.‌ అయినా నెనె‌ప్పుడూ రికా‌ర్డులు, కలె‌క్షన్ల గురించి ఆలో‌చిం‌చ‌లేదు.‌ నాకు కావ‌ల్సింది కేవలం పరి‌శ్రమ బాగో‌గులు మాత్రమే.‌ కేవలం నా సినిమా అనే కాదు.‌.‌ అందరి సిని‌మాలు మంచిగా ఆడాలి అను‌కునే వ్యక్తిని నేను.‌ అలా ఆడి‌న‌ప్పుడే కళా‌మ‌త‌ల్లిని నమ్ము‌కున్న వాళ్లకు ఆనందం’‌’‌ అన్నారు బాల‌కృష్ణ.‌ ఆయన కథా‌నా‌య‌కు‌డిగా నటిం‌చిన ‌‘జైసింహా’‌ సంక్రాంతి సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందు‌కొ‌చ్చింది.‌ సి.‌కల్యాణ్‌ నిర్మిం‌చిన ఈచి‌త్రా‌నికి కె.‌ఎస్‌.‌రవి‌కు‌మార్‌ దర్శ‌కుడు.‌ హైద‌రా‌బా‌ద్‌లో విజ‌యో‌త్సవం జరి‌గింది.‌ ఈ సంద‌ర్భంగా చిత్ర యూని‌ట్‌తో పాటు, డిస్ట్రి‌బ్యూ‌టర్లు పాల్గొ‌న్నారు.‌ బాల‌కృష్ణ మాట్లా‌డుతూ ‌‘ప్రస్తుతం చిత్రప‌రి‌శ్రమలో నిర్మా‌తల పరి‌స్థితి అంతంత మాత్రంగా ఉంది.‌ డిస్ట్రి‌బ్యూ‌టర్ల పరి‌స్థితి కూడా అంతే.‌ నేను నా నిర్మా‌త‌లం‌దరి బాగో‌గుల్ని దృష్టిలో పెట్టు‌కునే సిని‌మాలు తీస్తుంటా.‌ సి.‌కల్యాణ్‌ ఇది‌వ‌రకు నాతో ‌‘పరమ వీర‌చక్ర’‌ నిర్మిం‌చారు.‌ ఆ సినిమా ఎలా ఆడినా దానికి జాతీయ అవార్డు వచ్చింది.‌ ఇప్పుడు ‌‘జై సింహా’‌తో మంచి వసూళ్లు దక్కాయి.‌ ఈ విజ‌యంతో అందరి కళ్లలో ఆనందం చూస్తున్నా.‌ సినీ పరి‌శ్రమ కూడా ఈ హిట్‌తో ఆనం‌దంగా ఉంది.‌ ఈ సంక్రాంతి చాలా ఆహ్లా‌ద‌క‌రంగా సాగింది.‌ ఎప్ప‌ట్నుంచో కె.‌ఎస్‌.‌రవి‌కు‌మా‌ర్‌తో సినిమా చేయా‌లని అను‌కుం‌టున్నా.‌ అది ఇన్నే‌ళ్లకు ‌‘జై సింహా’‌తో తీరింది.‌ నేను తనపై పెట్టు‌కున్న నమ్మ‌కాన్ని నిల‌బె‌ట్టు‌కు‌న్నాడు.‌ జయా‌ప‌జ‌యాల గురించి నేనె‌న్నడూ పట్టిం‌చు‌కో‌లేదు.‌ అది దైవా‌ధీనం.‌ విజ‌యా‌నికి పొంగి‌పో‌వడం, పరా‌జ‌యా‌నికి కుంగి‌పో‌వడం నాకు తెలి‌యదు.‌ అది నాకు దేవుడు ఇచ్చిన వరం.‌ నా సిని‌మాల వసూళ్ల గురించి అభి‌మా‌నులు చెబు‌తుం‌టారు.‌ అభి‌మాన‌‘ధనమే’‌ నా బలం.‌ వాళ్లకు ఈ సినిమా నచ్చి‌నం‌దుకు ఆనం‌దంగా ఉంద’‌’‌న్నారు.‌ కె.‌ఎస్‌.‌రవి‌కు‌మార్‌ మాట్లా‌డుతూ ‌‘‌‘ఈ చిత్రా‌నికి వస్తున్న స్పంద‌నని బట్టి త్వర‌లోనే వంద‌కోట్ల మార్కును అందు‌కుం‌టుం‌దనే నమ్మకం కలు‌గు‌తోంది’‌’‌ అన్నారు.‌ సి.‌కల్యాణ్‌ మాట్లా‌డుతూ ‌‘‌‘ఈరో‌జుల్లో 100 రోజులు, 50 రోజుల చిత్రా‌లని చూడడం లేదు.‌ కేవలం ఎన్ని కోట్లు కొల్ల‌గొ‌ట్టిం‌ద‌న్నదే ప్రధా‌న‌మై‌పో‌యింది.‌ పది రోజుల్లో రూ.‌50 కోట్లు అందు‌కున్నాం.‌ మా సంస్థలో ఇంత మంచి సినిమా రావడం మాకు గౌరవం’‌’‌ అన్నారు.‌ ఈ కార్య‌క్రమంలో రామ్‌ లక్ష్మణ్, రాంప్రసాద్, ప్రభా‌కర్, రత్నం, శివా‌జీ‌రాజా, రవి ప్రకాశ్, సి.‌వి.‌రావు తది‌త‌రులు పాల్గొ‌న్నారు.‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.